Korutla | కోరుట్ల, జనవరి 11: కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో గోదావరి స్వామికి కుడారై వేడుకను కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి ఎదుట 108 గంగాళంలలో తీపి పదార్థాన్ని నైవేధ్యంగా సమర్పించి విశేష పూజలు నిర్వహించారు.
ఈ వేడుక తిలగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎత్తిరాజ్యం నరసయ్య, ధర్మకర్తలు, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆలయ ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.