Kanaparthy | వీణవంక, నవంబర్ 23 : వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల పైగా నిధులు సేకరించి గుడి నిర్మాణం చేపట్టగా గ్రామస్తులందరూ కలిసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా గ్రామంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి 23న ఉదయం ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వరశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య అభయాంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను ప్రతిష్టించారు.
వేలాదిమంది భక్తులు తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపనను వీక్షించారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యాదగిరి, బంగారు సారయ్య, రమేష్, పంజాల రాజు, తడిగొప్పుల శ్రీనివాస్, తడిగొప్పుల రవి, దాసారపు శివకుమార్, హనుమండ్ల గోపాల్, వెంకటేశ్వర్లు, అనిల్, ముత్యాల హుస్సేన్, అర్చకులు సతీష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.