Timmapur | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5: తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఘన పూజలు అందుకున్న గణనాథుడి చివరి రోజున ప్రత్యేక పూజలు చేసి సాగనంపారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి కోలాటాలు నృత్యాలు చేస్తూ బై.. బై.. గణేశా అంటూ వీడ్కోలు పలికారు.
ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామాల్లోని కుంటలు, చెరువులతోపాటు పలు గ్రామాల నిర్వాహకులు ఎల్ఎండీ రిజర్వాయర్లలో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.