Katnapalli | సుల్తానాబాద్ రూరల్, జూలై 9 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర ఆలయంలో గురువారం పదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, పూర్ణాహుతి, హోమం బలి హరణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హాజరైన భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంచామృతాలను పూజారులు ఈశ్వర ప్రసాద్, సత్యనారాయణ పంపిణీ చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామేశ్వరాలయం ఆలయ కమిటీ చైర్మన్ అడ్డగుంట రాజేందర్-కవిత, తాళ్లపల్లి శ్రీలత, రైస్ మిల్లర్ అసోసియేషన్ మాజీ మండల అధ్యక్షుడు చీటి కేశవ రావు, ధనమనేని ఆనందరావు, పాలకవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ మోరపల్లి మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఉమ్మెంతల భాస్కర్ రెడ్డి, ఎంటీఆర్, కొల్లూరి శంకరయ్య, ఉప సర్పంచ్ దాసరి రాయమల్లు, కనపర్తి సాగర్ రావు, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, వెంకట్రావు, సతీష్ రావు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, ఎల్లయ్య, తిరుపతిరావు శ్రీరాములు, పలువురు పాల్గొన్నారు.