sultanabad | సుల్తానాబాద్ రూరల్ 20: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు కాసర్ల అనంత రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా, మండలంలో గుర్తింపు పొందిన సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాల గా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఈ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటుగా డిస్టిక్ సైన్స్ ఫెయిర్, ఇస్రో మిషన్, రవీంద్ర భారతి రాష్ట్రపతి భవన్, కాళోజీ కలోత్సవాలు, స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్, వీర్ గాధ మొదలగు కార్యక్రమాల్లో, ప్రదర్శనల్లో పాల్గొని విజేతలుగా నిలిచి గ్రామానికి పేరు తీసు కురావడం అభినందనీయమని అన్నారు.
విజేతలకు బహుమతులతో సత్కరించారు. ఈ సంవత్సరం తొమ్మిదో తరగతి కూడా ప్రారంభించి గ్రామంలో హై స్కూల్ ఉండే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు.