MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్, నవంబర్ 13 : కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. కానీ నిబంధనలకు అనుకూలంగా రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సరయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.