MLA Vijaya Ramana Rao | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 15 : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం తూకం వేసిన తర్వాత డబ్బులు అకౌంట్ లో పడేవిధంగా చూసుకుంటానన్నారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సంఘ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, సీఈవో రమేష్, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.