ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తాయి. సర్కార్ బడిపై నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించండి అంటూ ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం హెచ్ఎం వంశీమోహనాచార్యులు తోటి ఉపాధ్యాయులతో కలిసి వినూత్నంగా ప్రచారం చేశారు. ఉదయం ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో కల్పించే వసతులు, విద్య గురించి వివరించారు.
– ధర్మారం, ఏప్రిల్ 1