Whip Srinivas | కథలాపూర్ మే 12 : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాయితీ నాగరాజు, భైర దేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.