SSC RESULTS | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. మొత్త 11 హైస్కూల్స్, 1 కేజీబీవీ, 1మోడల్స్కూల్ ఉండగా, కూనారం, మంగపేట, పందిల్ల గంగారం, తారుపల్లి, మొట్లపల్లి పాఠశాలల విద్యార్థులు100 శాతం ఉత్తీర్ణ సాధించినట్లు ఎంఈవో మహేశ్ తెలిపారు.
ఈ మేరకు ఆయన ఫలితాలను బుధవారం వెల్లడించారు. మల్యాల మోడల్ స్కూల్ లో ఆర్ సహస్ర వర్షిణి 564, ఏ కావ్య 563 మార్కులు సాదించి మండల టాపర్ గా నిలిచినట్లు పేర్కొన్నారు. మొత్తం 309 మంది విద్యార్థులకు గాను 302 మంది ఉత్తీర్ణులయ్యారని, మొత్తం 97.7 శాతం ఉత్తీర్ణత సాదించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాదించిన విద్యార్థులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘం నేతలు అభినందించారు.