రజకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులన్నీ రజకులకే వర్తించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. ఇప్పటికే లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నది. 282 కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో మోడ్రన్ దోభీఘాట్లు నిర్మించింది. తాజాగా, ఈ జీవోతో కులవృత్తికి చేయూతనిస్తుండగా, రజకుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కులవృత్తినే నమ్ముకున్న రజకుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. బట్టలు ఉతికేందుకు రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీలలో రూ. 282 కోట్లు ఖర్చుపెట్టి మాడ్రన్ ధోబీఘాట్లు నిర్మించింది. చిన్నచిన్న లాండ్రీ షాపులు పెట్టుకుని ఉపాధి పొందుతున్న రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నది. అంతేకాకుండా వారి ఆత్మగౌరవం పెంపొందించే విధంగా హైదరాబాద్‌లో ఐలమ్మ భవనానికి 2 ఎకరాల స్థలం, నిర్మాణానికి రూ. 5కోట్ల నిధులు విడుదల చేసింది. రజకుల కులవృత్తులను కాపాడేందుకు, వారి హక్కుల పరిరక్షణకు తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ శాఖల్లో బట్టలుతికే కాంట్రాక్టులు
పెద్ద కాంట్రాక్టులన్ని బడా పెట్టుబడి దారులకే దక్కుతున్నాయి. దీంతో బట్టలు ఉతికే వృ త్తిలో ఉన్న పేద రజకులకు ఉపాధి కరువైంది. దవాఖానలు, ఆర్టీసీ, పోలీసు, పాఠశాలలు ఇ లా ప్రతి ఒక్క శాఖలో పెట్టబడి దారులు కాం ట్రాక్టులు దక్కించుకుని రజకులతో అతి తక్కు వ వేతనాలు ఇచ్చి బట్టలు ఉతికిస్తున్నారు. జిల్లాలోని ఒక్క ఏరియా దవాఖానలోనే నెలకు రూ. 3.50లక్షల కాంట్రాక్టును పెట్టుబడి దారు లే దక్కించుకున్నారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను రజక సంఘా లు కలిసి మొరపెట్టుకున్నాయి. వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం అన్ని కాంట్రాక్టులు రజకులకే చెందేలా జీవో తెచ్చారు.
20 లక్షల మందికి ఉపాధి
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో రాష్ట్రంలోని 20లక్షల మంది రజకులకు చేతినిండా పని లభించే అవకాశం ఉంది. దవాఖానలు, పోలీస్ బెటాలియన్, ఆర్టీసీ, పాఠశాలలు, ఇలా ప్రతి ప్రభుత్వ శాఖలో బట్టలు ఉతి కే కాంట్రాక్టులన్నీ జీవో ప్రకారం రజకులకే చెందుతాయి. రజక కుల ధ్రువీకరణ పత్రాలున్న వారే టెండర్లు వేసే అవకాశం ఉంటుం ది. ఇది తక్షణం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రజక కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మా రజకుల బతుకుల్లో తెలంగాణ వచ్చినంకనే మార్పులు చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా మాడ్రన్ ధోబీఘాట్లను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. లాండ్రీ షాపులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తూ అండగా నిలిచింది. ప్రభుత్వ శాఖల్లో బట్టలు ఉతికే కాం ట్రాక్టులన్నీ పెద్ద బడా బాబులు దక్కించుకుంటున్నారు. తక్కువ వేతనాలిచ్చి రజకులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. మా గోస అర్థం చేసుకున్న కేసీఆర్, కేటీఆర్ కాంట్రాక్టులు మాకే వచ్చేలా జీవో ఇచ్చినందుకు రాష్ట్రంలోని రజకులంతా రుణపడి ఉంటాం.
– అక్కరాజు శ్రీనివాస్, తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు