Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 16 : కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాల్వశ్రీరాంపూర్ లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు మక్కలు పండించి కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలుల వల్ల మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, కనీసం అదికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టపరిహారాన్ని అంచనావేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రెండో విడత రైతు బంధు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు రైతులకు రైతుబంధు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు న్యాయం చేస్తామని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని, సన్న వడ్ల బోనస్ ఇవ్వాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోవు రోజుల్లో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమలో సర్పంచులు బూసి సదాశివరెడ్డి, తీగల నాగరాజు, నాయకులు బైరం రమేశ్, దొమ్మటి శ్రీనివాస్, నిదానపురం దేవయ్య, కామిడి వెంకట్రెడ్డి, ఇబ్రహీం, మాదాసి రాంచంద్రం, ఒడ్నాల శ్రీనివాస్, కుంభం రాజు, పిన్నింటి శ్యాంరెడ్డి, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.