Cybercrime | వేములవాడ, డిసెంబర్ 25: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్న పెడచెవిన పెడుతున్న మీరు మరోసారి మోసానికి బలి కాక తప్పలేదు. విద్యుత్ ట్రాన్స్ కో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా సైబర్ నేరగాళ్లకు చిక్కడమే కాకుండా తన రూ.13లక్షల నగదును పోగొట్టుకున్నాడు. వేములవాడ పట్టణానికి చెందిన ఆవునూరు భాస్కర్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి లో విద్యుత్ ట్రాన్స్కో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే తన మొబైల్ ఫోన్ వాట్సాప్ కు ఏపీకే ఫైల్ ఒకటి రాగా దానిని ఓపెన్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరారు. దీంతో అతను ఫైల్ ఓపెన్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయి బ్యాంకు ఖాతాకు అనుసంధానంగా ఉండడంతో అందులోని రూ.13 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నగదు బ్యాంకు ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు అపహరించినట్లు తెలుసుకొని సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.