Government education | జగిత్యాల, జూలై 11: ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు. అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం ఆ సంఘ సభ్యత్వాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో చక్కని వసతులతో అందరికీ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య , సంస్కారం లభిస్తుందన్నారు. విద్యార్థిని అన్ని రంగాల్లో ఆటలు పాటలు మానసిక స్థాయిలో అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోని జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అధునాతన పద్ధతులలో, కంప్యూటర్ ఆధారిత విద్య ఏఐ ఆధారిత విద్య సైన్స్ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లను ప్రవేశపెట్టి, క్రీడా సామాగ్రిని అందజేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి బోధనకు సిద్ధం చేసిందన్నారు.
ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్య అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనిచ్చి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు ప్రవీణ్ రావ్, రాజేందర్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.