Chigurumamidi | చిగురుమామిడి, జూలై 2 : చిగురుమామిడి మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్లును చిగురుమామిడి గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం వారి కార్యాలయాల్లో శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ తినిపించారు. ప్రజా సమస్యల పట్ల స్పందించి పరిష్కరించాలని వారు అధికారులను కోరారు.
సన్మానించిన వారిలో చిగురుమామిడి సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయ, బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్, వార్డు సభ్యులు రాకం అంజవ్వ, వేల్పుల భాగ్య, బీఆర్ఎస్ నాయకుడు కాశబోయిన రాజు ఉన్నారు.