Huzurabad Montessori | హుజురాబాద్ టౌన్, జూలై 11: ఆషాఢ మాసం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా అలంకరించుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గీతాషాజు మాట్లాడుతూ స్త్రీలకు అత్యంత ఇష్టమైన గోరింటాకు పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ గోరింటాకులో ఆరోగ్యానికి కావలసిన ఔషధ లక్షణాలు ఉన్నాయని, పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.