Gorintaku Mahotsavam | మల్లాపూర్, జూలై 11: మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాద్యాయులు, విద్యార్థినిలు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రతీ ఏటా ఈ సంప్రదాయాన్ని మహిళలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు భవాని అనురాధ, అరుణ్, జెమ్లానాయక్, విద్యార్థినిలు పాల్గొన్నారు.