కరీంనగర్ హౌసింగ్‌బోర్డు కాలనీ, జూన్ 1: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుపేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు పైచదువుల కోసం కపిల్ విద్య వారధి పేరుతో ఆర్థికసాయం చేసేందుకు సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నదని ట్రస్టు ఉపాధ్యక్షుడు అప్పిడి రాజిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు, తల్లి, తండ్రి లేని విద్యార్థులు, 470 పైగా మారులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 8న నిర్వహించనున్న అర్హత పరీక్షలో అత్యధిక మారులు సాధించిన పది మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారు ఏ కోర్సు చేసినా, వారికి నచ్చిన ఏ వృత్తిలోనైనా స్థిరపడే వరకు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు WWW.KAPIL VIDYA VARADHI.ORG వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.