వేములవాడ, మార్చి 23 : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత్తి పోసేందుకు పంప్ మోటర్లను ఆయన బుధవారం ఆన్‌చేసి, చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో గుడిచెరువు సుందరీకరణతోపాటు భక్తులకు నిత్య పుష్కరాలు జరిగేలా ఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. చెరువు నిండే వరకు నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు.
బద్దిపోచమ్మ ఆలయ విస్తీర్ణంలో భాగంగా బుధవారం రాజన్న ఆలయ అతిథి గృహంలో 10 మంది నిర్వాసితులకు రూ.5 కోట్ల పరిహారం చెక్కులను ఎమ్మెల్యే రమేశ్‌బాబు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది దేవుడి ప ని అని, ఆయనను స్మరించుకుం టూ పారదర్శకంగా పనిచేస్తామని చెప్పా రు. నిర్వాసితుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, అభివృద్ధిలో వారి పేర్లను శిలాఫలకంపై పెట్టిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హ న్మండ్లు, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్, జలాశయం ఈఈ జగన్, డీఈ శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ ప్ర శాంత్‌కుమార్, ఏఈ నవీన్, ఆలయ ఏఈవో సంకెపల్లి హరికిషన్, పర్యవేక్షకులు శ్రీరాములు, పీ ఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్, వీటీడీఏ ఎస్టేట్ అధికారి గంప సత్యనారాయణ, కౌన్సిలర్లు జడల లక్ష్మి, మారం కుమార్, ఇప్పపూల అజయ్, బింగి మహేశ్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, కోఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు పొలాస నరేందర్, గూడూరి మధు, కుమ్మరి శ్రీనివాస్, నీలం శేఖర్, సలీమ్, రాఘవరెడ్డి, నామాల లక్ష్మీరాజం, రాపెల్లి శ్రీధర్ పాల్గొన్నారు.