ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రముఖ ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా సాగింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో కనుల పండువలా నిర్వహించారు.
అర్చకులు పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను తీసుకువచ్చి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గోదారంగనాథుల ఉత్సవమూర్తులను అలంకరించి వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని జరిపించారు.
– మల్యాల, జనవరి 14