Give directions | అంతర్గాం. జూలై 30: అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ అభివృద్ధికి సింగరేణి, ఎన్టీపీసీ పరిశ్రమలు నిధులు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ జడ్పీటీసీ, బీజేపీ నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచంలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈమేరకు బుధవారం న్యూఢిల్లీలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించారు.
సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామమైన లింగాపూర్ గ్రామంలో సామాజిక బాధ్యత కింద ఏలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని, ఎన్టీపీసీ సంస్థ ద్వారా లింగాపూర్ నుంచి గోదావరి పంప్ హౌస్ వరకు సుమారు 3 కి.మీ సీసీ రోడ్డు, ఇరువైపుల సైడ్ డ్రైన్స్ నిర్మించేలా ఎన్టీపీసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థ ద్వారా లింగపూర్ నుంచి మేడిపల్లి ఓసీపీ 4 వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు సంస్థ సీఎండీకి సూచించాలన్నారు.
ఈ రహదారి ద్వారా సుమారు 17 గ్రామాల మత్స్యకారులు గోదావరిలో చేపల వేట కోసం ప్రయాణించేందుకు, అలాగే 17 గ్రామాల ప్రజలు పుణ్యస్నానాలు, కర్మకాండలు నిర్వహించుకునేందుకు ప్రధాన మార్గంగా అభివృద్ధి చెందుతుందన్నారు.