పెద్దపల్లి టౌన్, జూన్ 1 : అప్పటిదాకా ఇంట్లో సంతోషం గా ఆడిపాడిన ఆ బాలిక అను కోని రీతిలో మృత్యుఒడికి చేరిం ది. ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన నిట్టూరు సంతోష్, లత దంపతులకు కూతురు వైష్ణవి(12), కొడుకు సాకేత్ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సంతో ష్ మరణించగా లత తన కొడు కు, కూతురును తీసుకుని తల్లిగారిల్లయిన పెద్దపల్లిలోని సాగర్‌రోడ్డులో నివా సం ఉంటున్నది. అక్కడే పని చేసుకుంటూ.. ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది.
శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కూతురు వైష్ణవి తమ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటున్నది. ఆ సమయంలో అప్పటికే ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము బాలిక కాలుపై కాటు వేసిం ది. అయితే ఎలుక కొరికిందనుకొని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. రాత్రి సమయంలో వైష్ణవి ఉన్నట్టుం డి అపస్మారక స్థితిలోకి చేరి.. కింద పడిపోయింది. గమనించిన కుటుం బ సభ్యులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా పాముకాటుతో చనిపోవడంతో ఆ తల్లి జీర్ణించుకో లేక పోయింది. గుండెలవిసేలా రోదిస్తున్నది. తల్లి లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.