టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని.. ఒడ్యాడులో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
Hanging | మేడిపల్లి, మే 4 : తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం.. భీమారం మండలం ఒడ్యాడు గ్రామానికి చెందిన నిమ్మల రక్షిత (15) కు ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తోటి విద్యార్థులకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆమె మానసికంగా ఆవేదనకు గురైంది.
జీవితంపై విరక్తి చెందిన నిమ్మల రక్షిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లి నిమ్మల సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

