IIT seat | మల్లాపూర్, జూన్,17: ధర్వడ ఐఐటీలో మండల విద్యార్థి శ్రీఖర్ సీట్ సాధించడం అభిననందనీయమని తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సై రాజు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో వారు వేర్వేరుగా ఐఐటీ సీటు సాధించిన విద్యార్థి శ్రీఖర్ ని మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం కొత్త దాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రీకాంత్-శ్రావణి ల కుమారుడు, కేరళ హై స్కూల్ పూర్వ విద్యార్థి గంగిశెట్టి శ్రీఖర్ ఇటీవల వెలువడిన జేఈఈ అడ్వాన్స్ లో ఐఐటీ డార్వడ్ లో సీటు సాధించడం హర్షణీయమని కొనియాడారు. శ్రీఖర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేరళ హైస్కూల్ ప్రిన్సిపాల్ సీబీ అనిల్ సింగ్, శ్రీఖర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.