Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 02: తంగళ్లపల్లి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు బస్వాపూర్ ఆర్థిక సాయం అందజేసి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు చింతచెట్టు పై నుండి పడి బంటు ఆనందం అనే వ్యవసాయ కూలి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ సీనియర నాయకుడు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య ఆనందం కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. అదే విధంగా బస్వాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ పూర్మాని కనక లక్ష్మి లక్ష్మారెడ్డి రూ.2500, శ్రీనివాస్ రెడ్డి రూ.2500 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అంతక్రియలు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.20 వేలు అందంచాలని డిమాండ్ చేశారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆనందం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్నే బాలయ్య, మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ, ఎల్లయ్య, తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, గొడిసెల తిరుపతి, దేవయ్య, సత్తు రామ్ రెడ్డి, చంద్రమౌళి, సురేష్, మల్లయ్య, బాబు, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.