Karimnagar Dairy | సిరిసిల్ల టౌన్, జూన్ 18 : కరీంనగర్ డెయిరీ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న వంగ శ్రీనివాస్ రెడ్డి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళకు రక్తదానం చేసి తన తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఓ మహిళ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అత్యవసరకంగా ఏ నెగిటివ్ బ్లడ్ అవసరం ఉండగా, తక్షణమే స్పందించిన సూపర్వైజర్ వంగ శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ వెళ్లి దవాఖానాలో రక్తదానం చేశారు. ఆపదలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సూపర్వైజర్ వంగ శ్రీనివాస్ రెడ్డిని మహిళ కుటుంబ సభ్యులు, వైద్యులు, పలువురు అభినందించారు.