మల్యాల, మే 23: తక్కళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ కాలినపోయిన ఈత, తాటి వనాలకు పరిహారం అందించి గీత కార్మికులను ఆదుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కోరారు. తక్కళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పుంటుకుని ఈత, తాటివనాలు అగ్నికి ఆహుతికాగా శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తక్కళ్లపల్లి గ్రామ పరిధిలో నిప్పుంటుకుని సుమారు 1600 ఈత చెట్లు కాలిపోవడం ద్వారా గీత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
అనంతరం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడి గౌడ సంఘ ప్రతినిధులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు జనగం శ్రీనివాస్, గొడుగు కుమారస్వామి, మంద మహేశ్, ఉత్తెం గంగాధర్, దొనకొండ రమేశ్, పులి సుధాకర్‌గౌడ్, కందుల మల్లయ్య, రాజుగౌడ్, అశోక్, రాజయ్య, దశరథం, అరుణ్, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.