గీతకార్మికులను ఆదుకోవాలి
అన్నింటికన్నా గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనాలకు పరిహారం అందించాలని సూచించారు.
- ఈత, తాటి వనాలు కాలిపోతే పరిహారం అందించాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
- పొరండ్ల, కన్నాపూర్‌లో దగ్ధమైన ఈత, తాటివనాల పరిశీలన
జగిత్యాల రూరల్, మే 29: అన్నింటికన్నా గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనాలకు పరిహారం అందించాలని సూచించారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొరండ్ల, కన్నాపూర్ గ్రామాల్లో కాలిపోయిన ఈత, తాటివనాలను శుక్రవారం ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. వేసవిలో వడగాలులతో ఈత వనాలు కాపోతున్నాయని, రోజూ ఎక్కడో ఒకచోట ఈత, తాటి వనాలు కాలిపోయిన సంఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా పంట పరిహారం అందిస్తున్నదో.. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈత వనాలు ప్రమాదానికి గురయ్యాయో అక్కడ తిరిగి చెట్లు నాటుకోవడానికి గీత కార్మికులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని 21 గ్రామాల్లో ఈత, తాటి వనాలు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయని చెప్పారు.
ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఎక్కడున్న ప్రతి గీత సహకార సంఘానికి ఐదెకరాలు స్థలం ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నర్సింగాపూర్‌లో కూడా ప్రభుత్వ స్థలాలు లేకుంటే కొనుగోలు పథకం కింద ఐదెకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఇప్పిస్తే ఈత, తాటి వనాలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. గ్రామగ్రామాన బెల్టు షాపుల నిర్వహణతో గీతకార్మికులకు నష్టం జరుగుతున్నదని వాపోయారు.
బెల్టు షాపులతో ఎంత ఆదాయం వస్తుందో తెలియదుగానీ, వైద్యపరంగా గ్రామాల్లో లక్షకోట్లకు పైగా ప్రతి సంవత్సరం నిరుపేద కుటుంబాలపై భారం పడుతున్నదని ఆవేదన చెందారు. వైన్ షాపులు, బెల్టు షాపులపై పెట్టే శ్రద్ధ్ర గీతకార్మికులపై పెడితే ఉపాధి దొరుకుతుందని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రాష్ట్ర సర్కారు గీతకార్మికుల ఉపాధికి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీ రమేశ్ బాబు, మాజీ సర్పంచ్ చంద రాధాకిషన్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

