చిగురుమామిడి, సెప్టెంబర్ 16 : ప్రాథమిక విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఎస్ఈఆర్ టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భవిత కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనకై ఏర్పాటు చేసిన ఆక్సిలరేషన్ లెర్నింగ్ (ఏఎక్స్ఎల్) ల్యాబ్ ను పరిశీలించారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భవిత కేంద్రంలో
దివ్యాంగులకు అందిస్తున్న సేవలను ఐఈఆర్పి, ఫిజియోథెరపీ డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
చిగురు మామిడి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం) మేళాను జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా టీ ఎల్ ఎం లను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
టిఎల్ఎం ఉపయోగించడం ద్వారా విద్యార్థులలో ఎలాంటి విద్య సామర్ధ్యాలు పెంపొందుతాయని వారిని అడిగి తెలుసుకున్నారు.
ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసిల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో బాసం మధుసూదన్,మండల విద్యాధికారిని పావని, మండల నోడల్ అధికారి రాజయ్య, చిగురుమామిడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఇర్షాద్, పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.