Ganneruvaram | గన్నేరువరం, ఆగస్టు 13: మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో అలుగు పారుతుంది.దింతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో ఓ పెళ్లి చేరుకోవాల్సిన పెళ్లికొడుకు వాహనం వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో చెరువు కట్టపై నిలిచిపోయింది.
పెళ్లికొడుకు ఉన్న కారు నాలుగు గంటల పాటు చెరువు కట్ట పై వేచి చూసిన వరద ఉధృతి తగ్గలేదు. ఇక ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో పెళ్లికొడుకును బంధువులందరూ విదిలేని పరిస్థితిలో భుజాలపై మోసుకుంటూ అవతలి అడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకెళ్లారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో కల్వర్టు వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.