కార్పొరేషన్/రామడుగు, అక్టోబర్ 23 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు బుధవారం కరీంనగర్లో అశ్రునయనాల మధ్య ముగిశాయి. క్రిస్టియన్ కాలనీలోని స్వగృహం నుంచి సప్తగిరి కాలనీలోని స్వర్గధామం వరకు జరిగిన అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో రాజకీయ నాయకులు, బంధువులు తరలివచ్చారు. అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్, రాకేశ్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, సివిల్ సైప్లెకార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో ఉమా మహేశ్వర్, టీఎన్జీవో నాయకులు, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు లక్ష్మీనర్సమ్మ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గంగుల కమలాకర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గంగుల కమలాకర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఇక్కడ రామడుగు మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.