మంథని, జూన్ 19: గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు. గురువారం మంథని (Manthani) గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్ అధ్యక్షతన బోనాల కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా గంధం వెంకటస్వామి, ఉపాధ్యక్షుడిగా మోసం శంకర్, ప్రధాన కార్యదర్శిగా అంబటి కుమార్, సహాయ కార్యదర్శిగా అంబటి సతీష్, కోశాధికారిగా అంకరి ప్రకాష్, కార్యనిర్వాన కార్యదర్శిగా అంకరి శివ మురళిని ఎన్నుకున్నారు. మంథని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి త్వరలోనే గంగపుత్ర సంఘాల ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
ఈ బోనాల జాతర కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉన్న గంగపుత్రులు గంగమ్మ తల్లి మహా జాతర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అంబటి సాయిలు, అంకరి లింగయ్య, మోసం నరసయ్య, అటికేటి కోటేష్, బోయిని నారాయణ, జీదుల రాజేందర్, అంబటి గట్టయ్య, అంబటి సాయి, మర్రి రఘు, అంబటి నరేష్, సౌళ్ల స్వామి, అటికేటి శ్రావణ్, అటికేటి సాగర్, రానవేన చేతన్, రాబర్ట్ విల్సన్, అంబటి సాయికిరణ్ పాల్గొన్నారు.