Korutla | కోరుట్ల : కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే మహిళ ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా మెట్పల్లి బ్లడ్ బ్యాంకులో ఇరువురు మిత్రులు (ఓ పాజిటీవ్) రెండు యూనిట్ల రక్తదానం గురువారం చేసి ఆదర్శంగా నిలిచారు.
నేటి యువత మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం సోషల్ మీడియా వల్ల సమయం వృథా అవ్వడం అలవాట్లకు బానిసలు అవుతూ జీవితాలను నాశనం చేసుకునే కంటే సన్మార్గంలో నడవాలని గోపీనా వేణి గంగాధర్, పులి మాడి ప్రవీణ్ ఉపన్యాసకులు తెలిపారు. ఇందులో గంగాధర్ పెళ్లి రోజు కావడంతో మహిళకు రక్తదానం చేయడం సంతోషకరమని, ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.