Vageshwari | తిమ్మాపూర్, నవంబర్ 22 : తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ, ఈఈఈ విభాగాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలతో ఫ్రెషర్స్ హంగామా సృష్టించారు. ఆటపాటలతో అలరించారు. విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి గండ్ర శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థుల కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని అభినందించారు. అలాగే ఫార్మసీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాల ముగింపు వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించి వాక్సిన్ వినియోగం, ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమాల్లో జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్స్ శ్రీనివాస్, రామకృష్ణ, విభాగాల అధిపతులు చంద్రమౌళి, సంధ్యారెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.