Freshers’ ruckus | మల్లాపూర్, ఆగస్టు 22: మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలు పలువురిని ఆకర్షింపజేశాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భూమేష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.