Freshers’ Day celebrations | కోరుట్ల, ఆగస్టు 23: కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్లో పీఆర్బీఎం జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ప్రెషర్స్ పేస్ట్ పేరిట వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్లకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సినీ, జానపద నృత్యరూపకాలు అలరించాయి.
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పోతని నవీన్ కుమార్, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.