Free notebooks | చిగురుమామిడి, జూన్ 19 : మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ కు చెందిన ఆనంద్ స్వీట్ హౌజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.10వేల విలువగల లాంగ్ నోట్ బుక్స్, తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం ప్రాజెక్టు వర్క్ బుక్స్ అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు గురువారం బుక్స్ పంపిణీ చేశారు.
విద్యార్థులు చదువు వల్ల జ్ఞానం సంస్కారం మంచి నడవడి నిజాయితీ అవలంబించుకోవాలన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆనంద్ స్వీట్ హౌజ్ కరీంనగర్ గారు రూ.10 వేలు విలువగల బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహ స్వామి, అనురాధ, అనిత కుమారి, ప్రేమలత, రవీందర్ అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.