Medical camp | జగిత్యాల, జూలై 05 : జగిత్యాలలోని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ కార్యాలయంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను బీఆర్ఎస్నాయకులు ఆవిష్కరించారు. ఎల్ రమణ సూచన మేరకు ఎల్జీరాం హెల్త్ కేర్, వెల్ఫేర్ సొసైటీ ద్వారా మంగళవారం 9 గంటల నుండి 1 గంట వరకు శుభమస్తు ఫంక్షన్ హాల్, టౌన్ హాల్లో అపోలో రిచ్ హాస్పిటల్ వారిచే నిపుణులైన వైద్యుల ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం నాయకులు హెల్త్ కేర్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న పోస్టర్ ను ప్రధాన కార్యదర్శి ఆయిల్నేని సాగర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గట్టు సతీష్ ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వోళ్లేం మల్లేశం, దయాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.