Free mega medical camp | కోల్ సిటీ, ఆగస్టు 21: రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీ నగర్ లో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరంకు స్పందన లభించింది. ఆ డివిజన్ లో ని సుమారు 120 మంది సింగరేణి రిటైర్డు కార్మికులు, మహిళలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. షుగర్, బీపీ, ఈసీజీ, 2డీ ఏకో తదితర వైద్య పరీక్షలు ఉచిత గుండె, షుగర్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామగుండం ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికవర్ ఆస్పత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ శిబిరంలో మధు, అజిత్, రాహుల్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.