Eye medical camp | చిగురుమామిడి, అక్టోబర్ 18: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో సురక్ష హాస్పిటల్ హుస్నాబాద్, శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి, శరత్ మాక్సిజన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం శనివారం నిర్వహించారు.
ఈ శిబిరంలో 238 మంది ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, బీపీ, షుగర్ ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. 19 మందికి కంట్లో పొరలు ఉన్నట్లు గుర్తించి వారికి ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తామని కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సాయి శ్రీ, డాక్టర్ సతీష్, కంటి వైద్య నిపుణులు తిప్పారపు శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.