Free medical camp | కాల్వ శ్రీరాంపూర్, అక్టోబర్ 15 : కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్న పల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మందికి ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లోకేష్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. అనంతరం డాక్టర్ లోకేష్ ప్రాణాంతక జ్వరాలపై అవగాహన కల్పించారు. రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండే జ్వరాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
వైరల్ ఫీవర్ల కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. జ్వరానికి సొంత వైద్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకొని వైద్యుడితో చికిత్స పొందాలని వెల్లడించారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఉషన్న పల్లి గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిoచి నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్ తదితులు పాల్గొన్నారు.