health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, డీఎంవో డాక్టర్ హర్షిత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. గుండె వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ప్రగతి నగర్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరంలో దవాఖాన మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.