Medical camp | చిగురుమామిడి, మే 9: మండల కేంద్రంలోని శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించినట్లు కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో 68మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 23 మందికి శుక్లాలో ఉన్నట్లు గుర్తించి వారిని హైదరాబాదులోని పుష్పగిరి కంటి దావఖానకు ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా తీసుకెళ్లి కంటి ఆపరేషన్లకి తరలించినట్లు పేర్కొన్నారు.
అవసరమగు వారికి చుక్కల మందులు అందజేశామని తెలిపారు. చిగురుమామిడిలోని శ్రీనివాస విజన్ సెంటర్లో ప్రతీ బుధ, ఆదివారాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు అంజలి , ఆడెపు వినోద , సతీష్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.