Free Eye Camp | ధర్మారం,జూన్ 14 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో స్థానిక సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఆప్తమాలజిస్ట్ గోళ్ల సంతోష్ కుమార్ కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 38 మందికి కంటి పరీక్షలు చేయగా 13మందికి కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
వీరిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి దవాఖానలో ఉచిత శస్త్ర చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్య సేవలు అందించిన ఆప్తమాలజిస్ట్ సంతోష్ కుమార్ ను సర్పంచ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల రేషన్ డీలర్ అట్ల స్థానికులు వుల చందు,సంపత్,సీఏ బందరి ప్రియాంక,కారోబార్ పాలొజీ రమణచారి తదితరులు పాల్గొన్నారు.