Bommanapally | చిగురుమామిడి, ఫిబ్రవరి 19 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజిరెడ్డి, సమీరా అంజుం (బీఏఎంఎస్) విద్యార్థులు దంత సమస్యలను తెలుసుకొని పరిశీలించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
దంతాల పట్ల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావు, ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశ సుగుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.