Ramagundam Recreation Club | కోల్ సిటీ, మే 4: రామగుండం లో ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యన పారిశ్రామిక ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా వడదెబ్బ నివారిణిగా చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తూ రామగుండం రిక్రియేషన్ క్లబ్ బాసటగా నిలుస్తోంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక ప్రాంతం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం గోదావరిఖనికి రాకపోకలు సాగించేవారు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు సామాజిక సేవ దృక్పథంతో నెల రోజులపాటు ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం కొనసాగించేందుకు శ్రీకారం చుట్టింది.
ప్రతీరోజు వందల సంఖ్యలో ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తోంది.. రిక్రియేషన్ క్లబ్ సభ్యులు కె.శరత్ బాబు సహకారంతో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ కజంపురం జయప్రద-రాజేందర్ పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ పాత్రికేయులు నిట్టూరి జీవన్ బాబు, కార్యవర్గ సభ్యులు బంక రామస్వామి, మారుపాక రాజేంద్ర కుమార్, కొల్లూరి శ్రీనివాస్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాగా వీరి సేవా దృక్పథాలను పలువురు ప్రశంసిస్తున్నారు.