Education | పెద్దపల్లి, జూన్ 20(నమస్తే తెలంగాణ): జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్షను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 451 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు మరో 200ల మంది వరకు నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులున్నారన్నారు.
ప్రతీ ఏడాది జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీని కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ నుంచి సర్క్యులర్ ఇస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా జర్నలిస్టుకు ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఉచితం, మరోకరికి 50శాతం రాయితీ కల్పిస్తూ సర్క్యులర్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రతీ జర్నలిస్టు కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విధానం అమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వారు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యా శాఖ అధికారులతో మాట్లాడారు.
జర్నలిస్టు పిల్లలకు ఉచిత, రాయితీ విద్య అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(హెచ్ 143) నాయకులు అర్కూటి మల్లేష్, చిలారాపు కిషన్, తిరి తిరుపతిగౌడ్, మేకల సంతోష్, తిరి సుధాకర్, అనకట్ల ప్రసాద్, తూర్పాటి శ్రీనివాస్, కోయ్యడ తిరుపతియాదవ్, కత్తెర్ల తిరుపతి పాల్గొన్నారు.