Keshavapatnam | శంకరపట్నం, సెప్టెంబర్ 19 : కేశవపట్నం మెయిన్ రోడ్డులోని పెట్రోల్ పంప్ ఎదురుగా, బళ్ల (టేల) డబ్బాల వెనుక భాగం నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్పందించిన స్థానిక ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పారిశుధ్య సిబ్బందితో కలిసి వెతకగా, అక్కడ ఒక భారీ వరాహం (పంది) మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. అది పరిమాణంలో బరువైంది కావడంతో ఉపసర్పంచ్ తక్షణమే జేసీబీని రప్పించి, గుంత తవ్వించి దానిని పూడ్చిపెట్టించారు. అనంతరం దుర్గంధం వ్యాపించకుండా పరిసరాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యపై వెంటనే స్పందించి, విముక్తి కల్పించిన ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ను స్థానిక వ్యాపారులు, గ్రామస్తులు అభినందించారు.