రాయికల్, సెప్టెంబర్ 13: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉనాన్నని చెప్పడంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వారిని గులాబీ కండువాతో సతరించి.. బీఆర్ఎస్ జెండాను వారి ఇంటిపై ఎగురవేస్తామంటే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడిచేయడం బాధాకరమన్నారు. 60లక్షల కార్యకర్తల బలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే.. ప్రతిదాడులను ఎదురొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్తున్న తమ నాయకులు, కార్యకర్తలను ఎకడికకడ అరెస్ట్ చేసి నిర్బంధించడం దారుణమన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా ఉంటే.. రేవంత్ పాలన నరకయాతనలా ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఎలిగెటి అనిల్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు స్పందన సాగర్‌రావు, కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, శ్రీరాముల సువర్ణ సత్యనారాయణ, మహేశ్‌గౌడ్, సాయికుమార్, మండల సమన్వయ సభ్యులు సురేందర్‌నాయక్, మల్లేశ్‌యాదవ్, కొల్లూరి వేణు, దొంతి నాగరాజు, ఏఎంసీఈ మాజీ చైర్మన్ ఏనుగందుల ఉదయశ్రీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీరేటి శ్రీనివాస్, నాయకులు పెండెం కవిత, కొత్తపెల్లి ప్రసాద్, మరిపెళ్లి నారాయణగౌడ్, రామ్ చంద్రం, వినోద్, ముకెర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.