Sports Competitions | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికి పండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న గ్రామీణ వాలీబాల్ పోటీలు జీడినగర్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నాలుగు జిల్లాల గ్రామీణ వాలీబాల్ పోటీలను మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఐఏఎస్ నరహరి కుటుంబం ఆలయ ఫౌండేషన్ పేరుతో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకి క్రీడాకారులు ఎంపిక కావాలన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్ గాని నిలిచిన పరికిపండ్ల నరహరి పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న సంకల్పంతో ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం, ఉచిత కంటి ఆసుపత్రి, మహిళలకు కుట్టు శిక్షణ, ఇవ్వడంతో పాటు క్రీడాకారులు జానపద కళాకారులను ప్రోత్సహించడం కోసం మూడు రోజులపాటు పోటీలను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, దాసరి ఉష, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, ఫౌండేషన్ సీఈవో రమేష్ బాబు, ఏసీఈవో రాజేంద్ర కుమార్, సభ్యులు కీర్తి నాగార్జున, మలక రామస్వామి, పుప్పాల దయానంద్, పరికిపండ్ల రాము, లక్ష్మణ్, కన్నం వెంకటేష్, సోము, శ్రీనివాస్, జాగిరి శ్రీకాంత్, టోర్నమెంట్ నిర్వాహకులు కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్, పెద్దపెల్లి వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.